22న ఈసెట్, 24న ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు!

Thu,June 20, 2019 06:43 AM

Eamcet Counseling Notifications on the 24th june 2019

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈ నెల 22న ఈసెట్, 24న ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ల విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. ఈ రోజు తన కార్యాలయంలో అడ్మిషన్ కమిటీ సమావేశమై ఎంసెట్, ఈసె ట్ కౌన్సెలింగ్‌పై కీలక నిర్ణయాలు తీసుకుంటుందన్నారు.
ఎంసెట్ మార్కుల అప్‌లోడ్‌కు 23 గడువు
ఎంసెట్‌లో అర్హత సాధించి ఇంటర్ మార్కులు సరిగా అప్‌లోడ్ కాని విద్యార్థులు తమ మార్కులను అప్‌లోడ్ చేసుకోవడానికి ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చినట్టు ఎంసెట్ కన్వీనర్ యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత ఈ నెల 15 వరకు మార్కుల అప్‌లోడ్‌కు అవకాశమివ్వగా.. 2,951 మంది విద్యార్థులు తమ మార్కులను అప్‌లోడ్ చేసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో 2,147 మందికి ఇంజినీరింగ్, 804 మందికి అగ్రికల్చర్, ఫార్మసీ ర్యాంకులను కేటాయించామని వెల్లడించారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు మార్కుల అప్‌లోడ్‌కు గడువు పెంచినట్టు ఆయన వివరించారు.

1217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles