ఎంసెట్-2019 హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రారంభం

Sun,April 21, 2019 07:09 AM

EAMCET -2019 Hall tickets start downloading

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించే ఎంసెట్-2019కు ఏర్పాట్లుచేస్తున్నామని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య తెలిపారు. మే 3, 4, 6 తేదీల్లో ఇంజినీరింగ్, మే 8, 9 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆన్‌లైన్ పరీక్షలను రోజు రెండుపూటలా జరుపుతామని చెప్పారు. శనివారం నుంచి మే ఒకటి వరకు (https:// eamcet.tsche.ac.in) అనే వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించామని ఆయన వివరించారు. ఎంసెట్ కోసం మొత్తం 2,16,362 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.

1003
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles