ఎంసెట్-2016 షెడ్యూల్ విడుదల

Wed,February 24, 2016 03:33 PM

EAMCET-2016 Schedule release

హైదరాబాద్ : ఎంసెట్ -2016 షెడ్యూల్ విడుదలైంది. ఎంసెట్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. నోటిఫికేషన్ ఈ నెల 25న విడుదల కానుంది. ఫిబ్రవరి 28 నుంచి ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మార్చి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 3 వరకు, రూ. 1000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 13 వరకు, రూ. 5000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 22 వరకు, రూ. 10000 అపరాధ రుసుముతో ఏప్రిల్ 29 వరకు దరఖాస్తు చేస్తుకోవచ్చు.

తమ దరఖాస్తులలో తప్పులను సరిదిద్దుకునేందుకు ఏప్రిల్ 3 నుంచి అదే నెల 13 వరకు అవకాశం కల్పించారు. హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 24 నుంచి 30 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎంసెట్ పరీక్ష మే 2న జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష జరగనుంది.

మే 3న ఎంసెట్ ప్రాథమిక కీ విడుదల కానుంది. ప్రిలిమినరీ కీకి సంబంధించి అభ్యంతరాలను మే 9 వరకు స్వీకరిస్తారు. ఇక ఎంసెట్ ర్యాంకులను మే 12న ప్రకటించనున్నారు. పరీక్ష ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 250, ఇతరులకు రూ. 500లుగా నిర్ణయించారు.

2135
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles