అరచేతిలో ఈ గ్రంథాలయం.. స్మార్ట్‌ఫోన్ ద్వారా సేవలు

Sun,October 13, 2019 07:55 AM

దేశంలోనే అతిపెద్ద డిజిటల్ గ్రంథాలయాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ, ఖరగ్‌పూర్ ఐఐటీలు సంయుక్తంగా అందుబాటులోకి తీసుకొచ్చాయి. వృద్ధులు, పిల్లలు, యువత అభిరుచుల మేరకు పుస్తకాలను అందుబాటులో ఉంచారు. కంప్యూటర్ లేదంటే స్మార్ట్‌ఫోన్ ఏదీ వీలయితే దానిని వినియోగించుకుని సేవలు పొందవచ్చు. కంప్యూటర్‌లేని వారు ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌లతో అరచేతిలోనే పుస్తకాలను చదువుకోవచ్చు. పోటీ పరీక్షల ఆశావాహులు, పుస్తక ప్రియులను ఆకట్టుకునేందుకు ఇలాంటి ప్రయోగానికి శ్రీకారం చుట్టగా, 38 లక్షల మంది ఈ గ్రంథాలయ సేవలను వినియోగించుకుంటున్నారు. కోరుకున్న పుస్తకం దొరకాలంటే.. వందషాపుల, పదుల కొద్ది గ్రంథాలయాలను చుట్టేయాల్సిన ఈ తరుణంలో, రూపాయి ఖర్చుచేయకుండా,అరచేతిలోనే పుస్తకాలను చదుకోవడం, డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించడం గమనార్హం.


అరచేతిలో..పుస్తకాలు


పాఠకలోకపు దాహర్తీని తీరుస్తూ గ్రంథాలయాలు నేటికి విజ్ఞాన బాండాగారాలుగా వెలుగొందుతున్నాయి. సాహిత్య.. సాంస్కృతిక.. విద్యా క్షేత్రాల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్నాయి. అప్పటికి.. ఇప్పటికి గ్రంథాలయాల పట్ల మక్కువ తగ్గకపోవడం విశేషం. ఆధునిక కాలంలోనూ విద్యార్థులు.. నిరుద్యోగులు.. పోటీపరీక్షల కోసం సిద్ధమవుతున్న ఆశావాహులు గ్రంథాలయాలనే ఎంచుకుంటున్నారు. పాఠకుల అభిరుచులకు తగినట్లుగా గ్రంథాలయాలు సైతం మార్పునకు గురవుతున్నాయి. గ్రంథాలు, పుస్తకాలు. దినపత్రికలను అందుబాటులో ఉంచుతూ పాఠకుల మన్ననలను పొందుతున్నాయి. వృద్ధులు.. పిల్లలు.. యువత అన్నతేడా లేకుం డా అందరూ గ్రంథాలయాలను వినియోగించుకుంటున్నారు. విలువైన పుస్తకాలు. సాహిత్యం.. లక్షలాది గ్రంథాలు ఇప్పటికీ గ్రంథాలయాల్లో క్షేమంగా భద్రపరచబడ్డాయి. అయితే సాంకేతిక విప్లవం పుణ్యమాని డిజిటలైజేషన్ వైపు అడుగులేస్తున్నాయి. పాఠకుల అరచేతిలో కావాల్సిన పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నాయి.

ఏఏ అంశాలకు చెందిన పుస్తకాలు..


కంప్యూటర్ సైన్స్, సమాచారం, వ్యవసాయం, జనరల్‌వర్క్, గణితం, మతం, సాహిత్యం, భాష, కళలు, పైన్ ఆర్ట్స్, డెకోరేటివ్ ఆర్ట్స్, చరిత్ర, భూగోళశాస్త్రం, నేచురల్ సైన్స్, సైకాలజీ, ఫిలాసఫీ, సోషల్‌సైన్స్ లాంటి అనేక అంశాలకు సంబంధించిన పుస్తకాలను వినియోగంలోకి తీసుకొచ్చారు.


మెరుగు పెట్టకుండా రత్నానికి.. జ్ఞానం లేకుండా మనిషికి విలువలేదు అన్నాడో కవి. మానవుడికి జ్ఞానాన్ని.. విజ్ఞానాన్ని అందించేవి గ్రంథాలయాలు. ఇలాంటి గ్రంథాలయాలు రూపురేఖలు మార్చుకుంటున్నాయి. వర్తమాన కాలానికి అనుగుణంగా డిజిటల్ రూపును సంతరించుకుంటున్నాయి. దేశంలోనే అతిపెద్ద డిజిటల్ లైబ్రరీ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. రూపాయి ఖర్చుచేయకుండా కావాల్సిన పుస్తకాలను చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్న డిజిటల్ గ్రంథాలయ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..

డిజిటల్ గ్రంథాలయ ప్రత్యేకతలు* 70 భాషలకు సంబంధించిన పుస్తకాలను ఈ గ్రంథాలయంలో పొందుపరిచారు.
* పలుభాషలకు చెందిన 68 లక్షల పుస్తకాలను వినియోగంలోకి తీసుకొచ్చారు.
* 60 రకాలైన అభ్యసన సామగ్రిని అందుబాటులో ఉంచారు.
* 3 లక్షల మంది రచయితలకు చెందిన 10 మిలియన్ల పుస్తకాలు, 3లక్షల కథనాలను ఒకే వేదికపై చదువుకునే వెసులుబాటు కల్పించారు.
* ఇదే గ్రంథాలయంలో 262 ఆడియో టేపులను సైతం భద్రపరిచారు. వీటిని అవసరం మేరకు వాడుకోవచ్చు.
* ప్రాథమిక స్థాయి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యార్థులకవసరమ్యే పుస్తకాలన్నింటిని ఇదే గ్రంథాయలంలో క్రోడీకిరించి పెట్టారు. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్
* 23 అంశాలకు సంబంధించిన 33 వేల ప్రశ్నపత్రాలను చదువుకుకోవచ్చు.
* లైబ్రీవోక్స్ అనే లింక్ ద్వారా 2 లక్షల ఆడియోటేపులను వినొచ్చు.
* క్రిషికోశ్ అనే లింక్ ద్వారా 50వేల పైచిలుకు వ్యవసాయ సంబంధ పుస్తకాలు, జర్నల్స్, వ్యాసాలను చదువుకోవచ్చు.
* శోథ్‌గంగ అనే లింక్ ద్వారా 38 వేల పైచిలుకు థీసిస్, వ్యాసాలను చదువుకోవచ్చు.
* కావాల్సిన పుస్తకాలను పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎలా వినియోగించువాలంటే..


గూగుల్‌లో ndliitkgp. ac.inలో లాగిన అయ్యి రిజిష్టర్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. పేరు, ఈమెయిల్‌ఐడీ, పుట్టినతేదీ, ఎడ్యుకేషన్‌రోల్ భాష, సంస్థ తదితర వివరాలను పొందుపరిచి నమోదుచేసుకోవాలి. దీనికి ఎలాంటి రుసుము వసూలు చేయరు. ఇక స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు యాప్‌స్టోర్ నుంచి నేషనల్ డిజిటల్ లైబ్రరీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

909
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles