7, 8 తేదీల్లో ఉప్పల్ భగాయత్ ప్లాట్లకు ఈ వేలం

Sat,April 6, 2019 08:06 AM

E AUCTION OF PLOTS AT UPPAL bagayat phase 2

హైదరాబాద్ : ఉప్పల్ భగాయత్ ఫేజ్ -2లోని లేఔట్ ప్లాట్ల ఈ -వేలంకు సంబంధించిన హెచ్‌ఎండీఏ అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెల 7, 8వ తేదీల్లో రెండు రోజుల పాటు ఈ వేలం నిర్వహించనున్నారు. మొదటి విడతలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ విడత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఈ- వేలంలో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్న కోనుగోలుదారుల సహాయార్థం, ఈ వేలం ప్రక్రియ, ఈ వేలంలో పాల్గొనే పద్ధతిపై అవగాహన కోసం డెమో వీడియో WWW.HMDA.GOV.IN వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు సంస్థ కార్యదర్శి రాం కిషన్ తెలిపారు.

కొనుగోలుదారులకు మరింత అవగాహన కల్పించేందుకు లైవ్ మాక్ యాక్షన్ (నమూనా ఈ -వేలం) నేడు (శనివారం) మధ్యాహ్నం 4 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య నిపుణులతో నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇప్పటికే రిజిస్టర్డ్ కొనుగోలుదారులకు ఈ -మెయిల్ ద్వారా మాక్ లైవ్ యాక్షన్ గురించిన సమాచారాన్ని చేరవేర్చామని చెప్పారు.

ఈ వేలంలో పాల్గొనండి ఇలా..
WWW.MSTCECOMMERCE.COM వెబ్‌సైట్‌లో లాగిన్ కావాలి
-అక్కడ ఉన్న E-AUCTION(ఈ వేలం)పై క్లిక్ చేయాలి
-E-AUCTION (ఈవేలం) FOR GOVT. OF TELANGANA పై క్లిక్ చేయాలి
-యూజర్ నేమ్ (కొనుగోలుదారుని యూజర్ పేరు), పాస్‌వర్డ్ రాసి క్లిక్ చేసి లాగిన్ కావాలి.
-వ్యూ లైవ్/ఫోర్త్ కమింట్ యాక్షన్‌పై క్లిక్ చేయాలి
-డెమో యాక్షన్ లింక్‌పై సబ్ మిట్ బిడ్స్ క్లిక్ చేయాలి

-హెచ్‌ఎండీఏ, ఎంఎస్‌టీసీకి చెందిన ప్రత్యేక అధికారుల బృందం, ఐటీ నిపుణుల ఈ వేలం ప్రక్రియ పూర్తయ్యే వరకు 7, 8వ తేదీలలో కొనుగోలుదారు లు (బిడ్డర్లు) సహాయం కోసం పనిచేస్తూ ఉంటారన్నారు. ఈ వేలం పాటలో పాల్గొనేటప్పుడు వచ్చే ఎలాంటి సమస్యలపైన, అనుమానాలనైనా వారిని అడిగి తెలుసుకోవచ్చన్నారు.

-ఎంఎస్‌టిసీ నుంచి రేణు పురుషోత్తం (ఫోన్ నంబరు 8884406412), నితిన్ ఆనంద్ (9003316133), అనురాగ్ (9177067332), ధనుంజయ్ (9650554645), ఎంఎస్‌టిసి హెల్ప్ డెస్క్ (సహాయ కేంద్రం) 040 2330 1039

-హెచ్‌ఎండీఏ అధికారులు సుబ్రమణ్యం (9701945544), ఎం. సరస్వతి (9989336908), బి. హరినాథ రెడ్డి (709353 28282), గంగాధర్ (9491 739490), ఎం రాంకిషన్ (9440903166) నుంచి సమాచారం పొందవచ్చన్నారు.

1798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles