పాలమూరు పిల్లలమర్రికి సెలైన్ బాటిల్.. వీడియో

Wed,April 18, 2018 03:52 PM

Dying 700 year old banyan tree in Telangana gets saline bottle

మహబూబ్‌నగర్: తెలంగాణలో మహబూబ్‌నగర్ అంటే ముందు గుర్తొచ్చేది పిల్లలమర్రి. ఫేమస్ పర్యాటక ప్రాంతం కూడా. దాదాపు 700 ఏండ్ల కింది పిల్లలమర్రి అక్కడ విస్తరించి ఉంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ పిల్లలమర్రి ప్రపంచంలోని అతిపెద్ద చెట్లలో ఒకటి. అయితే.. ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే.

మరోవైపు.. ఆ చెట్టు ఇప్పుడు దీనస్థితిలో ఉంది. నేలకొరిగిపోయింది. చెదలు పట్టింది. చీడ పురుగు పట్టింది. ఇపుడు దాన్ని చూడటానికి అనుమతి కూడా లేదు. గత డిసెంబర్‌లోనే చెదలు ప్రభావం వల్ల కొన్ని చెట్టు కొమ్మలు కుప్పకూలిపోయాయి. ఇదివరకే దానికి ఇచ్చిన రసాయనాల వల్ల మరింత దెబ్బతిన్నది. దీంతో దానికి గత వైభవాన్ని తీసుకురావడానికి ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్ రాస్ కూడా దీనిపై స్పెషల్‌గా మానిటరింగ్ చేస్తున్నారు. అందుకే ఈ సారి.. దానికి చీడ నివారిణి క్లోర్‌పైరిఫోస్ అనే కెమికల్‌ను సెలైన్ బాటిల్ ద్వారా ఎక్కిస్తున్నారు. చెట్టు కొమ్మలన్నింటికీ రెండు మీటర్ల తేడాతో సెలైన్ ఎక్కిస్తున్నారు. మనుషులకు ఏదైనా రోగం వస్తే డాక్టర్లు ఎలా చూసుకుంటారో.. ఫారెస్ట్ అధికారులు కూడా సేమ్ అలాగే దాన్ని చూసుకుంటున్నారు. 700 ఏండ్ల చరిత్ర మట్టిలో కలిసి పోకుండా ఉండేందుకు ఫారెస్ట్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

"క్లోర్‌పైరిఫోస్ అనే కెమికల్‌ను చెట్టు కొమ్మలకు రంధ్రాలు చేసి దాంట్లో వేసేవాళ్లం. కాని అది చెట్టు మీద ఎటువంటి ప్రభావం చూపించలేదు. దీంతో సెలైన్ బాటిల్‌తో కెమికల్‌ను ఎక్కించడం ప్రారంభించాం. ఈ పద్ధతి బాగానే ఉంది. పని చేస్తున్నది. చెట్టు మొదట్లో కూడా ఈ కెమికల్‌ను వేస్తున్నాం. దీని వల్ల చెదలు తగ్గిపోతుంది. ఇంకా నేలకొరిగిపోయిన చెట్టు కొమ్మలకు సపోర్ట్‌గా పిల్లర్లు నిర్మిస్తున్నాం.. ప్రస్తుతానికి దాని ఆరోగ్యం బాగానే ఉంది. కొన్ని రోజుల్లో అది నార్మల్ అవుతుంది. దాని ఆరోగ్యం కుదుటపడగానే పర్యాటకులను అనుమతిస్తాం. కాని.. పర్యాటకులు దాన్ని ముట్టుకోవడానికి వీళ్లేదు. దూరం నుంచి మాత్రమే దాన్ని చూడాలి.. దాని దగ్గరికి అనుమితినివ్వకపోవచ్చు..." అని మహబూబ్‌నగర్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ చుక్క గంగా రెడ్డి తెలిపారు.4687
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles