నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం

Thu,March 21, 2019 08:37 AM

Duplicate and fake certificate makers arrested by Hyderabad Police

హైదరాబాద్ : నకిలీ సర్టిఫికెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి వివిధ యూనవర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి పరారీలో ఉన్నాడు. డీసీపీ రాధాకిషన్‌రావు కథనం ప్రకారం.. నాంపల్లి బజార్‌ఘాట్‌కు చెందిన మహ్మద్ హబీబీ 2012లో బీటెక్ పూర్తి చేసి టోలీచౌకిలోని రిలయెన్స్ జూనియర్ కాలేజీలో అడ్మిస్ట్రేషన్ విభాగంలో మూడేండ్లపాటు పనిచేశాడు. ఆ తరువాత మలక్‌పేటలోని యశోద దవాఖాన సమీపంలో అలీఫ్ ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ పేరుతో కన్సల్టెన్సీని ప్రారంభించాడు.

ఇదిలా ఉండగా... ఛత్తీస్‌ఘడ్‌లోని ఓ యూనివర్సిటీ డైరెక్టర్ సునీల్‌కపూర్ అలియాస్ బాలాజీ తరచూ హైదరాబాద్‌లో పదో తరగతి, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులను ఎంచుకొని తమ యూనివర్సిటీ నుంచి పరీక్షలు రాసేందుకు మార్కెటింగ్ చేసేవాడు. ఈ క్రమంలో హబీబ్ కాలేజీలో పనిచేస్తున్న సమయంలోనే సునీల్‌కు పరిచయం ఏర్పడి, అది స్నేహంగా మారింది. 2015లో సునీల్ చెందిన యూనివర్సిటీపై హైకోర్టు నిషేధం విధించింది. దీంతో అవసరమైన విద్యార్థులకు దేశంలోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన సర్టిఫికెట్లు అందించే బాధ్యత తనదని, వాటిని మార్కెట్ చేయాల్సిన బాధ్యత హబీబ్‌దని ప్లాన్ వేసుకున్నారు. దీంతో హబీబ్ అవసరమైన వారికి సర్టిఫికెట్లు ఇప్పిస్తానంటూ ఒప్పందాలు చేసుకుంటూ పదో తరగతి నుంచి బీటెక్ వరకు రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూలు చేస్తూ, అందులో తన కమీషన్ తీసుకున్న తరువాత మిగతాది సునీల్ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసేవాడు.

ఇలా స్వామి వివేకానంద, రాజస్థాన్ విద్యాపీఠ్, సీహెచ్ చరణ్‌సింగ్ యూనివర్సిటీ, ఛత్రపతి శివాజీ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పుణే, బోర్డు ఆఫ్ హైయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్, బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ, పుర్వాంచల్ తదితర యూనివర్సిటీలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయిస్తున్నారు. నకలీ సర్టిఫికెట్ల విక్రయాలపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లు బృందానికి సమాచారం రావడంతో బజార్‌ఘట్‌లోని హబీబ్ ఇంట్లో తనిఖీలు చేయడంతో నకిలీ సర్టిఫికెట్ల గుట్టు బయటపడింది. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో 16 నకిలీ విద్యార్హత సర్టిఫికెట్ల్లు, రెండు డీటీడీసీ కొరియర్ స్లిప్స్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు తదుపరి విచారణను నాంపల్లి పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి ఢిల్లీకి చెందిన సునీల్ కపూర్ కోసం గాలిస్తున్నారు.

1273
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles