రూ.10 లక్షల సబ్సిడీతో రైతులకు డ్రయ్యర్లుWed,November 15, 2017 12:36 AM

రూ.10 లక్షల సబ్సిడీతో రైతులకు డ్రయ్యర్లు

మెదక్ : రాష్ట్రంలోని రైతులను యాంత్రీకరణ వైపునకు మరల్చాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ పలు పథకాలను ప్రవేశపెడుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్‌లో 63వ అఖిల భారత సహకార వారోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల ధాన్యం ఆరబెట్టేందుకు రూ.10 లక్షల సబ్సిడీతో డ్రయ్యర్లను అందజేస్తామని, అవసరమున్న రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పండించిన పంట వానకు చెడిపోవద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ యంత్రాలను అందజేస్తున్నారని చెప్పారు. ఐదుగురు రైతులు కలిసి బృందంగా ఏర్పడి ప్రభుత్వమిచ్చే డ్రయ్యర్లను వినియోగించుకోవాలన్నారు. సమైక్య ప్రభుత్వాల కారణంగా అప్పుల్లో కూరుకుపోయిన రైతుల కన్నీళ్లు తుడవడం కోసమే సాగుకు 24 గంటల విద్యుత్తును ఇస్తున్నట్టు పేర్కొన్నారు. నీరు వృథా కాకుండా పంట దిగుబడికి డ్రిప్ పైపులను వందశాతం సబ్సిడీపై అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.

రాష్ట్రంలోనే కోనాపూర్ సహకార పరపతి సం ఘాన్ని ఆదర్శంగా నిలుపుతున్న దేవేందర్‌రెడ్డిని మంత్రి ఈ సందర్భంగా అభినందింంచారు. రూ.35 లక్షల టర్నోవర్ నుంచి ఏడేండ్లలో రూ.40 కోట్లకు తెచ్చిన ఘనత దేవేందర్‌రెడ్డికే దక్కిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5వేల జనాభా ఉన్న గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి,డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, డీఏవో పరశురాంనాయక్, డీసీవో వెంకట్‌రెడ్డి తదితరులున్నారు.

717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS