వాట్సప్‌లో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ!

Sun,July 21, 2019 10:03 AM

Driving license and RC in WhatsApp

హైదరాబాద్: డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల ఆర్సీ కార్డులను ప్రింటింగ్‌కు పంపించేముందు.. దరఖాస్తుదారులకు వాటి ప్రతులను వాట్సాప్, మెయిల్స్ ద్వారా పంపాలని రవాణాశాఖ అధికారులు నిర్ణయించారు. దీనివల్ల ప్రింటింగ్ సమయంలో తప్పులను సరిదిద్దే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేయనున్నట్టు రవాణాశాఖ జాయింట్ కమిషనర్, ఆన్‌లైన్ సర్వీసెస్ సిటిజన్స్ కమిటీ చైర్మన్ రమేశ్ తెలిపారు. శనివారం ట్రాన్స్‌పోర్టుభవన్‌లో రమేశ్ అధ్యక్షతన సమావేశమైన ఆన్‌లైన్ సర్వీసెస్ సిటిజన్స్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకొన్నది. ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్‌సెల్ ఏర్పాటుచేశామని.. రవాణాశాఖ అందించే సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొంటామని రమేశ్ చెప్పారు. పెండింగ్‌ కార్డులను సోమవారం నుంచి పంపిణీ చేస్తామన్నారు.

4207
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles