భక్తుల కోసం 115 ప్రాంతాల్లో మంచినీటి శిబిరాలు

Thu,September 12, 2019 10:01 AM

Drinking water camps arranged for devotees in ganesh yatra


హైదరాబాద్ : వినాయక విగ్రహాలతో నిమజ్జనానికి వచ్చే భక్తులకు మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగర వ్యాప్తంగా 115 ప్రాంతాల్లో మంచినీటి శిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు, భక్తుల కోసం 30.52 లక్షల నీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచినట్లు ఎండీ దానకిశోర్‌ తెలిపారు. గణేశ్‌ శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లో నీటి వసతులు కల్పించడం, సివరేజీ నిర్వహణల పర్యవేక్షణకు 10మంది నోడల్‌ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు.

రద్దీని బట్టికొన్ని ప్రాంతాల్లో 24, మరికొన్ని ప్రాంతాల్లో 48 గంటలపాటు మంచినీటి శిబిరాలు పని చేస్తాయన్నారు. 24 గంటలపాటు షిప్టుల వారీగా సిబ్బంది పని చేస్తారు. మంచినీటి ప్యాకెట్ల నాణ్యత విషయంలో రాజీపడొద్దని, ఐఎస్‌ఐ గుర్తింపు ఉన్న కంపెనీల నుంచి సేకరించాలని అధికారులను ఆదేశించారు.

శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో నీటి పైపులైన్‌లో ఏవైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టి, శోభాయాత్రకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాత్రివేళల్లో ఎయిర్‌టెక్‌ యంత్రాలతో ప్రధాన రహదారులతోపాటు, చిన్న చిన్న గల్లీల్లో సైతం మురుగునీటి పైపులైన్లను శుభ్రం చేయడంతోపాటు, మ్యాన్‌హోళ్లు ఉప్పొంగకుండా చూడాలని ఆదేశించారు. మ్యాన్‌హోళ్లు, కవర్లు ధ్వంసమైతే వెంటనే సరి చేయాలన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, వాడి పడేసిన మంచినీటి ప్యాకెట్లు, గ్లాసులను పారిశుధ్య సిబ్బంది సహకారంతో తొలగించాలన్నారు.

301
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles