దుబాయ్ వ్యక్తి వద్ద భారీగా బంగారం..

Fri,December 28, 2018 07:15 PM

DRI arrested dubai passenger at RGIA later seized gold

రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్‌పోర్టు పరిధిలో డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని సీజ్ చేశారు. నిన్న ఓ వ్యక్తి దుబాయ్ నుంచి ఒమన్ ఎయిర్‌లైన్స్‌లో శంషాబాద్ కు చేరుకున్నాడు. అతడు శంషాబాద్ ప్రధాన రహదారి వెంబడి వెళ్తుండగా డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మైక్రోవేవ్ ఒవెన్‌లోని ట్రాన్స్‌పార్మర్‌లో 46 బంగారు రేకులను పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించారు. బంగారం మొత్తం 2045 గ్రాములుండగా..దాని విలువ రూ. 66,05,350 ఉంటుందని అధికారులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు.

3114
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles