పిట్టలు పట్టేవాళ్లకు డబుల్ బెడ్రూం ఇళ్లు

Fri,August 4, 2017 02:42 PM

double bed rooms inaugurate in Pittalawada in siddipeta

సిద్ధిపేట : పిట్టలు పట్టేవాళ్లకు సొంతింటి కల నెరవేరింది. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా టీఆర్ఎస్ సర్కార్ ముందుకు పోతుంది. ఈ క్రమంలోనే పిట్టలు పడుతూ.. సంచార జీవనం గడిపే వారికి తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి ఇచ్చింది. చిన్నకోడూరు మండలం మందపల్లి పిట్టలవాడలో 20 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. సంచార జీవనం సాగించే వారిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. పిట్టలు పట్టేవాళ్లు తమ పిల్లలకు షికార్ నేర్పకుండా మంచి చదువులు చదివించాలన్నారు. అందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అమ్మినా, కొన్నా, కిరాయికి ఇచ్చినా కేసులు తప్పవని హరీష్ రావు హెచ్చరించారు. ఎవరికి ఇచ్చిన ఇళ్లలో వాళ్లు పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్నామని తెలిపారు. పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే సీఎం కేసీఆర్ కల అని స్పష్టం చేశారు. పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం కల్యాణలక్ష్మి సాయమందిస్తున్నామని చెప్పారు.

దేశ చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణలో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణ పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పిట్టలవాడను పట్నానికి తీసిపోని విధంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. 2 లక్షల 70 వేల ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. ఒక్క హైదరాబాద్‌లోనే లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సంక్షేమరంగంలో నెం.1గా ఉందన్నారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి.

1285
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles