దోస్త్ రిపోర్టింగ్‌కు గడువు రేపటి వరకు పొడిగింపు

Sun,June 16, 2019 08:30 AM

Dost reporting date is extension up to tomorrow

హైదరాబాద్: దోస్త్ ద్వారా సీట్లు పొందిన విద్యార్థులు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్ రిపోర్టింగ్ (సెల్ఫ్ రిపోర్టింగ్) చేయడానికి సోమవారం వరకు (ఈ నెల 17 వరకు ) గడువు పొడిగించినట్టు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. తొలుత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి శనివారం వరకు గడువు విధించామని.. కానీ కొందరు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆన్‌లైన్ రిపోర్టింగ్‌కు గడువు పెంచినట్టు శనివారం మీడియాకు చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రెండో దశ దోస్త్ సీట్ల కేటాయింపును 20న తెలియచేస్తామన్నారు.

1274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles