దోస్త్‌ నోటిఫికేషన్‌ తేదీ మార్పు

Wed,May 15, 2019 06:10 PM

హైదరాబాద్‌: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన దోస్త్‌ నోటిఫికేషన్‌ ప్రకటన వాయిదా పడింది. డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల నోటిఫికేషన్‌ ఈ నెల 15న విడుదల కానున్నట్లు దోస్త్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి మొదట్లో తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నెల 22న దోస్త్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 23 నుంచి దోస్త్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని ఐడీ కళాశాలల్లో ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్ సెంటర్‌లో విద్యార్థులు చేసే చిన్నపాటి పొరపాట్లను సరిదిద్దుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని 15 కళాశాలల్లో విద్యార్థులు నేరుగా రిజిస్ర్టేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. ఈ సారి ప్రవేశాల్లో విద్యార్థులు ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించి తమ సీటును కన్ఫామ్ చేసుకోవచ్చన్నారు. కులం, ఆదాయ ధృవపత్రాలు జతపరిచే విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందన్నారు. ఆయా కళాశాలల్లో సీటు వచ్చిన విద్యార్థులకు జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం.

1669
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles