దోస్త్ దరఖాస్తుల గడువు రేపటి వరకు పొడిగింపు

Wed,June 5, 2019 07:45 AM

DOST application date extend to June 6

హైదరాబాద్ : డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న దోస్త్ కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవడానికి గడువు గురువారం(ఈ నెల 6) వరకు పొడిగించారు. దోస్త్ నమోదుకు రూ.200 ఫీజు చెల్లిస్తే సరిపోతుందని, ఆలస్య రుసుం తీసుకోవడం లేదని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొందరు విద్యార్థులు ఫీజు చెల్లించి దోస్త్ కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి ముందుకు రాలేదని, వారికి అవకాశం ఇవ్వడానికి రెండురోజుల గడువు పొడిగించామని దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. మంగళవారం సాయంత్రం వరకు దోస్త్ కౌన్సెలింగ్ కోసం 1,18,329 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,12,940 మంది ఫీజు చెల్లించినట్టు తెలిపారు. ఫీజు చెల్లించినవారిలో 1,07,268 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో ఇప్పటివరకు 99,325 మంది కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారని పేర్కొన్నారు.

2459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles