డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్యకు దాశరథి అవార్డు

Wed,July 17, 2019 04:55 PM

Doctor Kurella Vitalacharya selected for Dasarathi Krishnamacharya award

హైదరాబాద్‌ : ప్రముఖ అభ్యుదయ కవి దాశరథి కృష్ణమాచార్య 95వ జయంతి ఉత్సవాన్ని ఈ నెల 22న నిర్వహించేందుకు రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సన్నాహాలు చేస్తోంది. 2019 సంవత్సరానికి గానూ ప్రముఖ కవి డాక్టర్‌ కూరెళ్ల విఠలాచార్యకు దాశరథి అవార్డు వరించింది. దాశరథి పేరిట ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవార్డును ఆయన జన్మదినం రోజు(జులై 22)న విఠలాచార్యకు ప్రదానం చేయనున్నారు. నల్లగొండ జిల్లా వెల్లంకిలో విఠలాచార్య జన్మించారు. పద్యం, గద్యం, నాటకం, బుర్రకథ, వ్యాసం, బాలసాహిత్యంతో పాటు పలు పక్రియల్లో రచనలు చేశారు విఠలాచార్య. 70వేల పుస్తకాలతో వెల్లంకిలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. 2018లో ప్రముఖ కవి వజ్జల శివకుమార్‌కు, 2017లో ఆచార్య ఎన్‌. గోపికి, 2016లో ప్రముఖ కవి బాపురెడ్డికి, 2015లో తిరుమల శ్రీనివాసాచార్యకు దాశరథి అవార్డు వరించిన సంగతి తెలిసిందే.

678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles