ఎవరి పని వారు చేసుకోవడమే దేశభక్తి: ఉపరాష్ట్రపతి

Sat,February 9, 2019 12:26 PM

do your duty first says vice president of India

హైదరాబాద్‌: దేశానికి సుస్థిర అభివృద్ధే అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నగరంలోని తార్నాక ఎన్‌ఐఎన్‌లో దేశాభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై సదస్సు నిర్వహణ జరుగుతుంది. ఈ సదస్సుకు ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు మరెన్నో పరిశోధనలు జరగాలన్నారు. వాతావరణం, మహిళా సాధికారత, నిరుద్యోగం, విద్యపై లోతుగా చర్చించాలన్నారు. వృద్ధిరేటు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. ప్రతిఒక్కరూ శాంతి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ భక్తి అంటే.. ఎవరి పని వారు కర్తవ్యంగా చేసుకోవడమేనన్నారు. పర్యావరణం, దేశ సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పారు. జనం ఆరోగ్యంగా ఉంటేనే.. దేశం సుసంపన్నంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles