ఆలయాల అభివృద్ధిపై రాజకీయాలు వద్దు : ఇంద్రకరణ్ రెడ్డి

Tue,August 21, 2018 02:37 PM

do not do politics on temples development says Minister Indrakaran reddy

హైదరాబాద్ : రాష్ట్రంలో పవిత్రమైన దేవాలయాల అభివృద్ధిపై రాజకీయాలు చేయడం సరికాదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు.. తెలంగాణ ఆలయాలను అభివృద్ధి చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. రూ. 238 కోట్లతో వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు చేశామన్నారు. అయినా అభివృద్ధి జరగడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ. 400 కోట్లు కేటాయించారని మంత్రి గుర్తు చేశారు. సాంకేతిక కారణాల వల్లే అర్చకుల వేతనాల చెల్లింపులో జాప్యం ఏర్పడిందన్నారు. అర్హులైన మిగతా అర్చకులు, ఆలయ ఉద్యోగులకు త్వరలోనే వేతనాలు చెల్లిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

1048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS