దొంగ సర్వేలను చూసి గోల్ మాల్ కావొద్దు : సీఎం కేసీఆర్

Wed,December 5, 2018 04:15 PM

do not confuse on fake surveys says CM KCR at Gajwel TRS Meeting

మెదక్ : రాష్ట్రంలో కొందరు విడుదల చేస్తున్న దొంగ సర్వేలను చూసి గోల్ మాల్ కావొద్దు అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రజలకు సూచించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన టీ ఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దొంగ సర్వేలను చూసి గోల్ మాల్ కావొద్దు. ఇప్పటికే 118 నియోజకవర్గాలను చుట్టి వచ్చాను. 119 నియోజకవర్గంలో డిక్లేర్ చేస్తున్నా. టీ ఆర్ ఎస్ 100 సీట్ల పైనే గెలవబోతోంది. గజ్వేల్ లో గెలిచిందే గవర్నమెంట్ వస్తది. గజ్వేల్ లో కేసీఆర్ గెలుస్తడని మీరు చెబుతున్నారు. ఇక మన గవర్నమెంట్ ఖాయమైపోయింది. గజ్వేల్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసుకున్నాం. గజ్వేల్ లో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు అది నా బాధ్యత. ప్రతి ఇంటికి సబ్సిడీ మీద పాడి గేదేలు ఇచ్చుకుందాం. ఈ నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు నీళ్లు పారాలి. కూరగాయలు ఎక్కువగా పండిస్తాం కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టుకుందాం. కమర్షియల్ పంటలు పండించుకుందాం. కేసీఆర్ ను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తే రాష్ట్రంలో మన గౌరవం పెరుగుతది. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. నేను మీ మధ్యలో ఉండి.. మన అవసరాలన్నింటినీ తీర్చుకుందాం. గజ్వేల్ కు చాలా పరిశ్రమలు రాబోతున్నాయి. కాలుష్య రహిత పరిశ్రమలను తీసుకువస్తాం. మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించుకుందాం. వలస శక్తులకు చోటు ఇవ్వొద్దు.. చంద్రబాబుకు అధికారం ఇవ్వొద్దని ప్రజలను కేసీఆర్ కోరారు.

2002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles