ఆగస్టు 15న బీసీ రుణాల పంపిణీ ప్రారంభం: ఈటెల

Sun,August 12, 2018 05:34 PM

హైదరాబాద్: రజక, నాయి బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 15 రోజు బీసీ రుణాల పంపిణీ 31 జిల్లాల్లో లాంఛనంగా ప్రారంభించనున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు రూ.2వేల కోట్ల వరకు బీసీ వర్గాలకు పూర్తి సబ్సిడీపై గ్రాంట్స్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. బ్యాంకుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ద్వారా గ్రాంట్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. బీసీ రుణాల మంజూరు విషయంలో లబ్ధిదారులు దళారుల మోసపూరిత మాటలను నమ్మవద్దని సూచించారు. రుణాల మంజూరులో పైరవీలకు స్థానం లేదని పేర్కొన్నారు.

పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు. సీఎం కేసీఆర్ బీసీ వర్గాల పెన్నిది, దీనులు, అభాగ్యుల బాధలు, ఆకలి, ఆర్థనాథాలు తెలిసిన వ్యక్తి. ఇది నిరంతరంగా రుణాల అందజేసే ప్రక్రియ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకు, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. పేదరికమే గీటురాయిగా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. సమావేశంలో మాజీ మంత్రి సారయ్య, ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఆలోక్, చంద్రశేఖర్, సంఘాల నాయకులు పాల్గొన్నారు.

4251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles