బడ్జెట్‌పై చర్చ ప్రారంభం

Sat,February 23, 2019 10:34 AM

Discuss on Telangana Budget

హైదరాబాద్‌ : తెలంగాణ శాసనసభలో నిన్న ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది. బడ్జెట్‌పై చర్చను కాంగ్రెస్‌ సభ్యుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రారంభించారు. బడ్జెట్‌పై చర్చ జరిగిన అనంతరం సీఎం కేసీఆర్‌ సమాధానం ఇవ్వనున్నారు. బడ్జెట్‌పై చర్చ ప్రారంభం కంటే ముందు.. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును సీఎం తరపున మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. సభ ప్రారంభం కాగానే మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారీతో పాటు ఇటీవలే మృతి చెందిన 16 మంది ఎమ్మెల్యేలకు సభ్యులు సంతాపం తెలిపారు. సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles