బడ్జెట్‌పై సాధారణ చర్చ ప్రారంభం

Sat,September 14, 2019 12:23 PM

discuss on budget in telangana assembly

హైదరాబాద్‌ : శాసనసభలో బడ్జెట్‌పై చర్చ ప్రారంభమైంది. టీ విరామ అనంతరం సభలో బడ్జెట్‌పై చర్చను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల అన్ని రంగాలు కుదేలవుతున్నాయని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రభావం కనిపిస్తోందన్నారు. కేంద్రం నిధులు, రాష్ర్టానికి రావాల్సిన పన్నుల వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు. అంతకుముందు వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన పీవీ సింధుకు, చంద్రయాన్‌2 ప్రయోగం నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఓవైసీ శుభాకాంక్షలు తెలిపారు.

470
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles