ఐదువేల పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు

Mon,February 27, 2017 06:58 AM

Digital classrooms in Five thousand schools at telangana state

హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో డిజిటల్ తరగతుల ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు వేల పాఠశాలల్లో డిజిటల్ తరగతుల పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించిన విద్యాశాఖ, ప్రస్తుతం 3,800 పాఠశాలల్లో దాన్ని అమలు పరుస్తున్నది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి మిగిలిన 1,200 పాఠశాలల్లో కూడా ఆ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న 119 బీసీ గురుకుల విద్యాలయాల్లో కూడా ఈ పథకాన్ని అమలు పరుచడానికి విద్యా శాఖ కమిషనర్ జీ కిషన్ సన్నాహాలు జరుపుతున్నారు. డిజిటల్ పాఠాలకు సంబంధించి కంప్యూటర్లు, సిలబస్, ఇంటర్నెట్‌తో పాటు ఆర్వోటీ మిషన్లను కూడా అధికారులు సిద్ధం చేశారు.

1117
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles