ఇర్కోడు గ్రామంలో మంత్రి హరీశ్‌రావు పర్యటన

Sat,August 12, 2017 11:58 AM

digital classroom in siddipet

సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం భవన నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. సిద్దిపేట మండలం ఇర్కోడ్‌లో రజక, గౌడ సంఘాల భవన నిర్మాణాలకు మంత్రి భూమిపూజ చేశారు. ఇర్కోడు గ్రామంలోని హైస్కూల్‌లో హరీశ్‌రావు డిజిటల్ తరగతులు ప్రారంభించారు. సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధికి మారుపేరు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గంలోని అన్నిగ్రామాలు అభివృద్ధి పథం లో దూసుకుపోతున్నాయి. అంతే కా కుండా ఇంకుడు గుంతలు, సీసీ రోడ్ల నిర్మాణాలు, పశువుల పాకలు, గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించుకోవడంలో రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచిం ది. మంత్రి ప్రత్యేక చొరవతో క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరుతో ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలు అభివృద్ధి బాటకు అడుగులు వేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గంలో అభివృద్ధికి మారుపేరుగా.. మరో ఆదర్శ గ్రామంగా ఇర్కోడు గ్రామం అడుగులు వేస్తుంది.
సకల సౌకర్యాలతో పంచాయతీ భవనం..
నూతన గ్రామ పంచాయతీ భవనం కావాలని గ్రామస్తుల కోరిక మేరకు మంత్రి హరీశ్‌రావు.. ఉపాధి నిధుల నుంచి రూ. 13 లక్షలు మంజూరు చేశారు. గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న తీరును చూసి.. సకల సౌకర్యాలతో కూడిన పంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి మరో రూ.10 లక్షలు మంజూరు చేయించారు. సర్పంచ్ మారెడ్డి వినీతారవీందర్‌రెడ్డి గ్రామ పంచాయతీ ఆవరణలో చిన్న కుండిల్లో వివిధ రకాల పూల మొక్కలు ఏర్పాటు చేయించారు. అంతే కాకుండా, ఎవైనా సమావేశాలు జరిగినప్పుడు ప్రజలకు కూర్చునేందుకు వీలుగా ఆవరణను సిద్ధ్దం చేశారు. నూతన గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు కావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సామూహిక గొర్ల షెడ్లు..
గొర్రెల కాపరులకు ఇబ్బంది కలగకుండా జీవాలను సంరక్షించుకోవడానికి గ్రామ శివారులో ఒకే దగ్గర 21 సామూహిక షెడ్ల నిర్మాణాన్ని ఉపాధి హామీ నిధులతో నిర్మించారు. ఒక్కో షెడ్డుకు రూ.50 వేల వ్యయంతో నిర్మిస్తున్నారు.

పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు..
గ్రామంలో వీధివీధినా సీసీ కెమెరాలను ఏర్పా టు చేసి, నిఘా వ్యవసస్థలోనూ ఆదర్శంగా నిలువనుంది. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితో గ్రా మంలో నేరాలు, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అరికట్టేందుకు, ప్రతి వీధి ని నిఘా నీడలో ఉంచేందుకు రూ. 5లక్షలతో 34 కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను వీక్షించేందుకు వీలుగా గ్రామ పంచాయతీ భవనంలో ప్రత్యేక గది కేటాయించి, ఎల్‌ఈడీ టీవిని ఏర్పాటు చేశారు. దీంతో పాటు వైఫై కేబుల్ ద్వారా సిద్దిపేట రూరల్ పోలీస్‌స్టేషన్, సీపీ కార్యాలయంలోని సీసీటీవి కంట్రోల్ రూంకు అనుసంధానించనున్నారు. దీని వల్ల నేరాలు, దొంగతనాలు జరగకుండా.. వెంటనే నిందితులను గుర్తించడం సులభతరం కానుంది. గ్రామం మీదుగా వెళ్తున్న వాహనాలను కూడా రికార్డు చేసేందుకు వీలుగా మెదక్-సిద్దిపేట రోడ్డు పొడవునా 4 సీసీకెమెరాలను బిగించారు. దీంతో రోడ్డు ప్రమాదాలను గుర్తించవచ్చు. నిఘా వ్యవస్థను నేడు మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.

రైతుల కోసం వ్యవసాయ గిడ్డంగి..
రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందు కు ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని గ్రామంలో ప్రతి యేడా ది రెండుసార్లు కొనుగోళ్లను ప్రారంభిస్తారు. వర్షకాలం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ధాన్యం నిల్వ చేసుకునేందుకు వీలుగా వ్యవసాయ గిడ్డంగి పనులను ప్రారంభించారు. ఇటీవలే గిడ్డంగి నిర్మాణ పనులు పూర్తి కావడంతో దీనిని కూడా మంత్రి ప్రారంభించనున్నారు.

సర్కారీ బడిలో డిజిటల్ క్లాస్ రూం..
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు మంత్రి ప్రత్యేక చొరవతో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూం ఏర్పాటు చేశారు. ఇందుకు అవసరమయ్యే రూ.3 లక్షలను మంత్రి మంజూరు చేశా రు. దీని ద్వారా నూతన సాంకేతికతతో విద్యార్థ్ధులకు బోధించేందుకు వీలుగా ఉంటుంది. దీంతో పాటు విద్యార్థ్ధులకు కంప్యూటర్ తరగతులను కూడా బోధించనున్నారు.

విద్యార్థుల కోసం మోడల్ టాయిలెట్లు..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థ్ధులకు మోడ్రన్ టాయిలెట్లను రూ.2 లక్షల ఉపాధి నిధుల నుంచా నిర్మిస్తున్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థ్ధులకు కలిపి రెండు టాయిలెట్లు నిర్మించారు.

877
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles