డయల్ 100కు ఫోన్ చేస్తే యువతిని రక్షించారు...

Tue,December 3, 2019 06:09 PM

మంచిర్యాల జిల్లాలోని లక్షటిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన కూతురు ఇంట్లో కనబడలేదు అని ఒక తండ్రి డయల్ 100కు కాల్ చేశాడు. కంట్రోల్ రూమ్ సిబ్బంది సంబంధిత అధికారులకు వివరాలు తెలిపాడు. వెంటనే సీఐ నారాయణ నాయక్, తమ బ్లూ క్లోట్స్, సిబ్బందిని, పెట్రో కార్ సిబ్బందిని అలర్ట్ చేసి వారి ఇంటి వద్దకు పంపించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికించారు. మంచిర్యాల డీసీపీ జిల్లా మొత్తం అధికారులను అలర్ట్ చేసి వెంటనే మంచిర్యాల టౌన్ లో రాత్రి పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న మంచిర్యాల రూరల్ సర్కిల్ సి.ఐ. వై. క్రిష్ణ కుమార్ కు వాహనాల తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేశారు.


వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న మంచిర్యాల పోలీసులకు ఐబి చౌరస్తా వద్ద లక్షటిపేట్ వైపు నుంచి వస్తున్న పేపర్ తీసుకువచ్చే వాహనం తనిఖీ చేయగా అందులో 22సంవత్సరాల అమ్మాయిని గుర్తించి ఆమెను డీసీపీ కార్యాలయం తీసుకెళ్లారు. మంచిర్యాల డీసీపీ డి.ఉదయ్ కుమార్ అమ్మాయితో మాట్లాడుతూ ఇలా ఇంట్లో చెప్పకుండా ఎందుకు వచ్చావని విచారించారు.

తల్లితండ్రులు మందలించడం, కోపగించుకోవడం వలన మనస్తాపం చెంది మంచిర్యాలకి వచ్చానని, ట్రైన్ కిందపడి చనిపోదామనుకున్నట్లు చెప్పింది. ఆ వాహనంలో ఎలా వచ్చావ్ అని అడగగా మా నాన్న కి రోడ్డు ప్రమాదం జరిగింది. మంచిర్యాల హాస్పిటల్ లో ఉన్నాడు అని చెప్పగా పేపర్ వాహనంలో ఎక్కించుకున్నారని వివరించింది. యువతి తల్లితండ్రులను పిలిపించి వారికీ, అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.
సకాలంలో స్పందించి వెంటనే వాహన తనిఖీలు చేపట్టి అమ్మాయిని గుర్తించి క్షేమంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించి నందుకు రామగుండం పోలీస్ కమీషనర్ సి.ఐ.వై. కృష్ణ కుమార్
ను, సిబ్బందిని అభినందించారు.

2144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles