వ్యాస్‌ను ఆదర్శంగా తీసుకోవాలి : డీజీపీ

Mon,February 11, 2019 03:04 PM

DGP mahender reddy speech on KS Vyas

హైదరాబాద్‌ : పంజాగుట్ట సెస్‌ భవన్‌లో కేఎస్‌ వ్యాస్‌ స్మారక ఉపన్యాసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గత 23 ఏళ్లుగా వ్యాస్‌ మెమోరియల్‌ లెక్చర్‌లో భాగంగా ప్రముఖులతో ఉపన్యాసం ఇప్పిస్తున్నామని గుర్తు చేశారు. ఈ రోజు ప్రజారోగ్యంపై ప్రొఫెసర్‌ శ్రీనాథ్‌రెడ్డితో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పోలీసు శాఖలో చేరిన నాటి నుంచి తనకు వ్యాస్‌ ఆదర్శమని డీజీపీ పేర్కొన్నారు. ప్రభుత్వం కోరుకుంటున్న పోలీసింగ్‌ రావాలంటే వ్యాస్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. రాష్ట్ర పోలీసు శాఖ ఎన్నో సామాజిక, ఉపయోగకరమైన అంశాలను అమలు చేస్తున్నాం. సమస్యలు పరిష్కరించడంతో పాటు సమస్యలు రావడానికి గల కారణాలు తెలుసుకొని చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు.

1393
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles