రాజన్న క్షేత్రం.. భక్తజనసంద్రం

Tue,February 12, 2019 01:04 PM

Devotees rush at vemulawada rajarajeshwara swamy temple

వేములవాడ : ఎములాడకు భక్తులు పోటెత్తారు. ఆలయం, క ల్యాణకట్ట, ధర్మగుండం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేకువజాము నుంచే బారులు తీరారు. స్వామివారి దర్శనానికి దాదాపు 2 గంటలపాటు సమయం పట్టింది. అనంతరం స్వామివారికి భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో కోడె మొక్కు లు, గండదీపం మొక్కులు, సత్యనారాయణవ్రతాలు, కల్యాణ మొక్కులు, పల్లకీ సేవలు, పెద్దసేవలు తదితర మొక్కులను చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భగుడిలో నిర్వహించుకునే పలు ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు. దీంతో భక్తులు రాజన్న అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయంలో అభిషేకాలు నిర్వహించుకున్నారు.

నిన్న సుమారు 40 వేల కు పైగా భక్తులు దర్శించుకోగా ఆలయానికి దాదా పు రూ.21 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఆలయంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంలో ఆలయ ఈవో దూస రాజేశ్వర్, ఏఈవో ఉమారాణి, దేవేందర్, పర్యవేక్షకులు నటరాజ్, శ్రీరాములు, రాజేశం భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

614
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles