పుష్కర స్నానం చేసిన హైకోర్టు జడ్జి

Sun,October 21, 2018 09:27 PM

devotees Rush at bhima pushkaram 2018

మక్తల్ : పవిత్ర భీమా పుష్కరాలల్లో భాగంగా 11వ రోజైన ఆదివారం భక్తులు పోటెత్తారు. పుణ్నస్నానాలు ఆచరించేందుకు తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి తరలివచ్చారు. దీంతో కుసుమూర్తి, సుకూర్ లింగంపల్లి, తంగిడి పుష్కరఘాట్లు కిటకిటలాడాయి. కృష్ణ మండలం కుసుమూర్తి పుష్కర ఘాట్‌లో 10,200 మంది, సుకూర్‌లింగంపల్లి ఘాట్ వద్ద 3,400 మంది పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కర స్నానం చేసి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. నదీ తీరంలోని ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. యువత సెల్ఫీతో సరదాగా గడిపారు. కొందరు గతించిన తల్లిదండ్రులకు పిండప్రదానం చేశారు.

పుష్కర స్నానం చేసిన హైకోర్టు జడ్జి


సుకూర్ లింగంపల్లి ఘాట్‌లో హైకోర్టు జడ్జి సీవీ. నాగార్జునరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానం చేశారు. తర్వాత సమీపంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గతించిన వారి పితృదేవతలకు పిండ ప్రదానం జరిపారు. తండ్రి అస్తికలను వేద పండితుల మంత్రచ్ఛరణల మధ్య భీమా నదిలో కలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ కేవీ. ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ రామారావు, మహబూబ్‌నగర్ డీఆర్వో వెంకటేశ్వర్లు, రెవెన్యూ అధికారి బక్క శ్రీనివాస్ పుష్కర స్నానం ఆచరించారు.

1199
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles