అంజన్నకు అగ్గిపెట్టేలో ఇమిడే శాలువా బహూకరణ

Tue,July 23, 2019 09:21 PM

devotee gift saliva to Anjanna

మల్యాల : కొండగట్టు ఆంజనేయ స్వామి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ అనే భక్తుడు తయారు చేసిన అగ్గిపెట్టేలో ఇమిడే రెండు మీటర్ల శాలువాను ఆలయ అధికారులకు అందజేశారు. అధికారులు, అర్చకులు విజయ్‌తో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించి అనంతరం స్వామి వారి ప్రాకార మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. భవిష్యత్తులో నేతన్నల కుల వృత్తి మరింత ఖ్యాతి సాధించేలా పలు సంస్కరణలు, విభిన్నమైన ఉత్పత్తులను తయారు చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ, అర్చకులు రాము, ఆలయ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్ రావు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles