ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

Mon,April 29, 2019 02:29 PM

deputy tahsildar in acb net at garidepally suryapet

సూర్యపేట: రైతు నుంచి లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ అవినీతి నిరోదక శాఖ అధికారులకు చిక్కాడు. గురిడేపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయంలో పని చేస్తున్న డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ పట్టా పాసుపుస్తకంలో మార్పు కోసం లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు తహసీల్దార్ కార్యాలయంలో రూ. 8వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం ఇవ్వడం, లంచం తీసుకోవడం నేరమని ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు విజ్ఞప్తి చేశారు.

640
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles