కేరళకు అండగా నిలవాలి: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ

Sun,August 19, 2018 04:16 PM

Deputy cm mahamood ali ugres to help kerala victims

హైదరాబాద్ : జల ప్రళయానికి విలవిల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి అండగా నిలవాలని..తమ వంతుగా ఆదుకునేందుకు మానవతావాదులు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కోరారు. కేరళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రం తరపున రూ.25 కోట్లు కేటాయించి తన ఔదార్యాన్ని చాటుకున్నారన్నారు. తనవంతు సహాయంగా ఒక నెల వేతనాన్ని ఇస్తున్నట్లు మహమూద్ అలీ ప్రకటించారు.

ప్రకృతి సోయగంతో కళ కళలాడే కేరళ రాష్ట్రంలో ఒక్కసారిగా జలప్రళయం బీభత్సం సృష్టించి అందరిని కలిచి వేసింది. ఎంతో మంది నిరాశ్రయులయ్యారు, కనీసం ఉండటానికి నీడ లేకుండా వరదల్లో సర్వం కోల్పోవడం చాలా మంది హృదయాలను కలచివేసింది. చేయి, చేయి కల్పి ఎవరికి తోచిన విధంగా వారు విరాళాలు, బట్టలు, దుప్పట్లు, పాలు, తినే సామగ్రిని కేరళ ప్రజలకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఉప ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

1675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles