మేడారం జాతర ఏర్పాట్లపై సమీక్ష

Sat,December 23, 2017 12:57 PM

Deputy CM Kadiyam Srihari review on Medaram Jatara

హైదరాబాద్ : వచ్చే ఏడాది జవనరి 31 నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క - సారలమ్మ జాతర ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, చందులాల్, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతర నిర్వహణ, సౌకర్యాలు, వసతుల కల్పనపై అధికారులతో మంత్రులు చర్చించారు. ఈ జాతరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి దాదాపు కోటి మందికి పైగా భక్తులు వస్తారని మంత్రులు పేర్కొన్నారు. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. మేడారం జాతర జనవరి 31 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు కొనసాగనుంది. 31న సారలమ్మ, ఫిబ్రవరి 1న సమ్మక్క గద్దెకు వస్తారు. 2వ తేదీన భక్తులు మొక్కులు చెల్లిస్తారు. ఫిబ్రవరి 3న అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు.

2193
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles