పల్లె పాటలను కాపాడుకోవాలి : కడియం

Sat,December 16, 2017 10:26 AM

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలు రెండో రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం వేదికగా బృహత్ కవి సమ్మేళనం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం కడియ శ్రీహరి హాజరై ప్రసంగించారు. బృహత్ కవి సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో కవులు హాజరయ్యారు.


తెలంగాణ సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతగానో ఉపయోగపడుతాయని డిప్యూటీ సీఎం కడియ శ్రీహరి చెప్పారు. పల్లె పాటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరి నాట్లు వేసేటప్పుడు, వడ్లు దంచేటప్పుడు పాడే పాటు ఇప్పుడు కనుమరుగయ్యాయి. అలాంటి పాటలను మళ్లీ ప్రజల్లోకి తీసుకురావాలని కోరారు. తెలంగాణ తెలుగే అసలు తెలుగు అని ప్రపంచానికి చాటి చెబుదామన్నారు. భాష ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలని కడియం చెప్పారు.

2346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles