వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలతో కడియం భేటీ

Mon,March 20, 2017 10:04 PM

హైదరాబాద్ : వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు, సీనియర్ నేతలు, మేయర్ నరేందర్, జిల్లా అధ్యక్షుడు తక్కెలపల్లి రవీందర్ తో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, గిరిజన శాఖ మంత్రి చందూలాల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, పనుల వేగవంతం, ప్లీనరీ ఏర్పాటు, సభ్యత్వ నమోదుపై చర్చించారు. రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వ నమోదు చేయాలని, ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.

జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డు, ఇరిగేషన్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత మంత్రులతో 21, 22, 23 తేదీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని, ఈ సమావేశాలకు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని కడియం ఆదేశించారు.

సీఎం కేసీఆర్ వరంగల్ పై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయించినందుకు జిల్లా తరపున ధన్యవాదాలు తెలిపారు. కేటాయించిన నిధులు ఖర్చు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకొని సద్వినియోగం చేయాలని సూచించిన డిప్యూటీ సీఎం సూచించారు.

వరంగల్ జిల్లా నేతలందరితో ఇలాంటి సమావేశం నిర్వహించినందుకు కడియంకు జిల్లా నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహించాలని విన్నవించారు. పాత వరంగల్ జిల్లాలోని అన్ని జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు కడియం సూచించారు.

522

More News

మరిన్ని వార్తలు...