ఇంటర్ పర్యావరణ పుస్తకాలు విడుదల

Wed,September 12, 2018 08:38 PM

deputy chief minister kadiyam srihari release intermediate environmental books

హైదరాబాద్ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరానికి సంబంధించి తెలుగు, ఇంగ్లీషు మీడియం పర్యావరణ విద్య పుస్తకాలను ఆపద్ధర్మ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో నేడు విడుదల చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ లో పర్యావరణం తప్పనిసరి సబ్జెక్టు కావడంతో, ఈ పుస్తకాలను ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ విభాగం రూపొందించింది. ఇంటర్మీడియెట్ లో విద్యార్థులంతా కచ్చితంగా ఈ పర్యావరణ సబ్జెక్టులో పాస్ అయితేనే మిగిలిన సబ్జెక్టులను ఉత్తీర్ణత కోసం పరిగణనలోకి తీసుకుంటారని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ కుమార్, ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ వసుంధరాదేవి, రీడర్ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.

518
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles