మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లాలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం కడియం

Thu,July 13, 2017 10:04 AM

deputy chief Minister Kadiyam Srihari participated in Haritha haram

మహబూబ్ నగర్ జిల్లా, భూత్పూర్ మండలంలోని కేజీబీవీ లో హరితహారంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మొక్కలు నాటారు. కార్య‌క్ర‌మంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే ఆలే వెంకటేశ్వర రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ , స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. అనంత‌రం కేజీబీవీ లో వసతుల గురించి డిప్యూటీ సీఎం, మంత్రులు విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిలతో కలిసి అల్పాహారం చేసిశారు. అక్క‌డి నుంచి భూత్పూర్ అటవీ ప్రాంతానికి వెళ్లిన మంత్రులు బ్లాక్ ప్లాంటేషన్ చేసి, సీడ్ బాల్స్ కొండల్లో విసిరారు. ఈ సంద‌ర్భంగా మంత్రి క‌డియం మాట్లాడుతూ...మహబూబ్ నగర్ కరువు జిల్లా..దానివల్ల ప్రజలు వలసలు వెళ్తున్నారు. ఈ కరువు పోవాలంటే వర్షాలు రావాలి. అవి రావాలంటే మొక్కలు పెద్ద ఎత్తున నాటాల‌ని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ కలెక్టరు విషయంలో జరిగింది దురదృష్టకర సంఘటన. ఎమ్మెల్యే కలెక్టర్ కి క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత చట్టం తన పని తాను చేస్తుంద‌ని వెల్ల‌డించారు.

856
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles