సినారె మృతి సాహితీలోకానికి తీరని లోటు: క‌డియం

Mon,June 12, 2017 11:24 AM

Deputy Chief Minister Kadiyam Srihari Condolence to c. narayanareddy

ప్రముఖ కవి, రచయిత, సాహితీవేత్త, జ్ణానపీఠ్ అవార్డు గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యుడు, డాక్టర్ సి. నారాయణరెడ్డి మృతిపట్ల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి సాహితీలోకానికి తీరని లోటుగా అభివర్ణించారు. సాహిత్యరంగానికి, తెలుగు చలన చిత్ర రంగానికి, ఆయా విశ్వవిద్యాలయాల భాషా సంఘాలు, సాంస్కృతిక మండలిల అధ్యక్షునిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. అనేక పురస్కారాలు, బిరుదులు ఆయనను వరించాయి. ఆయన కవిత్వాలు, గేయాలు, రచనలు సమాజంపై ఎంతో ప్రభావాన్ని చూపాయన్నారు. డాక్టర్ సి.నారాయణ రెడ్డి మృతి ఆయనను అభిమానించే వారందరికీ తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్ధిస్తున్నాన్నారు.

2243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles