అన్ని పార్టీలను పరిగణలోకి తీసుకునే తుది నిర్ణయం

Wed,June 19, 2019 08:18 PM

Defence Minister Rajnath Singh after conclusion of the meeting of Presidents of all parties called by PM Modi

ఢిల్లీ: పార్లమెంటరీ లైబ్రరీ హాలులో అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలపై సమావేశంలో చర్చ జరిగింది. గాంధీజీ 150వ జయంతి ఉత్సవాలు ఇతర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ... అఖిలపక్ష సమావేశంలో 21 పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. మూడు పార్టీల అధ్యక్షులు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలు తెలిపారు. మొత్తం 24 పార్టీలు తమ అభిప్రాయాలు వెల్లడించాయి. ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలకు దాదాపు పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, పార్టీలు మినహా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలపై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని చెప్పారు. నిర్థిష్ట కాలపరిమితిలో కమిటీ నివేదిక ఇస్తుందని స్పష్టం చేశారు. కమిటీలో ఎవరెవరు ఉంటారో ప్రధాని నిర్ణయిస్తారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా కొనసాగించడానికి అందరూ అంగీకరించారు. చర్చల ద్వారా అన్ని అంశాలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. నీటి సంరక్షణ గాంధీ 150వ జయంతి కార్యక్రమాలపై చర్చ జరిగింది. వెనుకబడిన జిల్లాలను మరో 10శాతం పెంచాలని కోరారు. స్వచ్ఛత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాం. అన్ని పార్టీలను పరిగణలోకి తీసుకునే తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు.

2043
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles