ప్రైవేట్ పాఠశాలల ఏర్పాటుకు గడువు 31

Sun,December 10, 2017 10:58 AM

December 31st is the deadline of private schools formation

హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ప్రైవేట్ పాఠశాలలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ నెల 31తో గడువు ముగిస్తుందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు జీ కిషన్ తెలిపారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను అంగీకరించబోమని తేల్చిచెప్పారు. దీనికి సంబంధించిన సవరణ జీవోను ఆయన శనివారం విడుదల చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులకు, ప్రాంతీయ విద్యాధికారులకు ఆదేశాలు జారీచేశారు. వాస్తవానికి అక్టోబర్‌లోనే పాఠశాలల ఏర్పాటుకు గడువు ముగిసిందని ఆయన తెలిపారు. రూ.20 వేల ఆలస్య రుసుంతో ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటు కోసం ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా వంద వరకు దరఖాస్తులు వచ్చాయని ఆ శాఖ అధికారులు వెల్లడించారు.

1463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles