బోటులో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు

Tue,October 22, 2019 04:28 PM

తూర్పుగోదావరి: కచ్చలూరు వద్ద మునిగిపోయిన బోటు బయటపడింది. రాయల్ వశిష్ఠ బోటును డైవర్లు ఒడ్డుకు తీసుకువచ్చారు. పూర్తిగా ధ్వంసమైన స్థితిలో బోటు ఒడ్డుకు చేరుకుంది. బోటులో గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు ఉన్నాయి. శవాలు పూర్తిగా కుళ్లిపోయి అవయవాలు బయటపడుతున్నాయి. మృతదేహాలకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మృతదేహాల నుంచి డీఎన్‌ఏ సేకరించి కుటుంబ సభ్యులతో పోల్చి మృతదేహాలను అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

3129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles