తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

Thu,July 25, 2019 02:47 PM

Daughter performed funeral rites for the father in wardhannapet

వరంగల్ రూరల్: పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడంటారు. అటువంటి కొడుకులేని లోటు తీరుస్తూ కాలం చేసిన తండ్రికి కూతురే తలకొరివి పెట్టింది. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండ్లె వెంకట్రాంనర్సయ్య(72)కు ముగ్గురు కూతుళ్లు. వివాహాలు జరిగి భర్తలతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నారు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న వెంకట్రాంనర్సయ్య పరిస్థితి విషమించి ఈ రోజు తెల్లవారుజామున మృతిచెందారు. మృతుడికి కొడుకులు లేకపోవడంతో పెద్ద కూతురు కుడికాల సరస్వతి తండ్రికి తలకొరివి పెట్టింది.

1484
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles