కవి బాపురెడ్డికి దాశరథి సాహిత్య పురస్కారం ప్రదానం

Fri,July 22, 2016 01:34 PM

Dasarathi literary prize awarded to poet Bapu Reddy

హైదరాబాద్ : రవీంద్రభారతి వేదికగా దాశరథి కృష్ణమాచార్య 92వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దాశరథి జయంతి వేడుకల సందర్భంగా ప్రముఖ కవి బాపురెడ్డికి దాశరథి సాహిత్య పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసింది. తనకు దక్కిన పురస్కారంపై బాపురెడ్డి ఉద్విగ్నంతో ఆనందబాష్పాలు రాల్చారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఆనాటి నిరంకుశ పాలనను దాశరథి తన కవితలతో చీల్చి చెండాడారు అని గుర్తు చేశారు. తెలంగాణ సమాజం గర్వించదగ్గ మహాకవి దాశరథి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, చందూలాల్, సాంస్కృతిక శాఖ సలహాదారు రమణాచారితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

2356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles