జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు పొడిగింపు

Wed,October 17, 2018 01:28 PM

హైదరాబాద్ : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు దసరా సెలవులను పొడిగిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 18 వరకు ఉన్న సెలవులను మరో రెండు రోజుల పాటు పొడిగించింది. అక్టోబర్ 19, 20వ తేదీల్లో కూడా కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ వెల్లడించారు. ఈ నెల 22న కాలేజీలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు.

7215
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles