HomeLATEST NEWSCyberabad Police auction of 2481 vehicles

సైబరాబాద్‌లో 2481 వాహనాల వేలంకు సిద్ధం

Published: Sat,September 22, 2018 10:11 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని లభించిన, స్వాధీనం చేసుకున్న వాహనాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు పోలీసు కమిషనర్ సజ్జనార్ నిర్ణయించారు. ఈ నేపధ్యంలో మొత్తం 2481 వాహనాలను వేలం ద్వారా విక్రయించనున్నారు. దీనిపై ఎవైనా అభ్యంతరాలు ఉన్నా, మీ వాహనాలు వీటిలో ఉన్న వాటి కోసం 15 రోజులలో సీపీ సైబరాబాద్ ఎదుట దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదే విధంగా www.cyberabadpolice.gov.in వెబ్‌సైట్‌ల వాహనాల వివరాలను తెలుసుకోవచ్చన్నారు. అదే విధంగా ఇతర అంశాల సమాచారం కోసం రిజర్వు ఇన్స్‌పెక్టర్ వై.మట్టయ్య (9491039133) సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. ఈ వాహనాలను సైబరాబాద్ పోలీసు గ్రౌండ్‌లో ఉంచారు.
4523
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology