భారీ క్యాష్ ఆఫర్ అంటూ మోసాలు

Fri,July 6, 2018 10:03 AM

cyber criminals offers high cash check

హైదరాబాద్ : నాప్‌టోల్....అమెజాన్...ఓఎల్‌ఎక్స్...ఫ్లిప్‌కార్ట్...స్నాప్‌డీల్...వెబ్ సైట్‌లలో షాపింగ్ చేశారు... వాటి పై మీకు బంపర్ లాటరీలో భారీ బహుమతి వచ్చింది అని ఏమైనా ఫోన్ కాల్స్, మెయిల్స్ గాని వస్తున్నాయా...అయితే అది కచ్చితంగా సైబర్ మాయగాళ్ల ఛీటింగ్ అని అనుమానించండి అంటూ రాచకొండ సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల ఈ తరహ మోసాలు పెరుగుతుండడం చాలా మందిని బాధితులుగా మారుస్తుంది. ఖరీదైన బహుమతులు అనగానే చాలా మంది బాధితులు ముందు వెనకా ఆలోచించకుండానే లక్షలు డిపాజిట్ చేస్తున్నారు. ఆ తర్వాత లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయిస్తుండడంతో సైబర్ క్రైం పీఎస్‌లో ఫిర్యాదులు నమోదు పెరుగుతున్నాయి.

ఈ ఫిర్యాదులపై విశ్లేషించిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు ఆశతోనే అమాయకులు వారిని నమ్ముతు నగదును పోగట్టుకుంటున్నారని తేలింది. ఇంత డబ్బు ఎందుకు వేశారని ప్రశ్నించగానే అమాయక సమాధానాలు పోలీసు అధికారులను విస్మయానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి వ్యాపారులు వీటి బారిన పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. సైబర్ ఛీటర్‌లు అమాయకులను నమ్మించేందుకు ఏకంగా ఆర్‌బీఐ గవర్నర్ సంతకంతో జారీ చేసిన ఓ లేఖ ను సైతం వాట్సాప్‌లో పంపిస్తున్నారు. అదే విధంగా వారిపై అనుమానం రాకుండా ఉండేందుకు ఏకంగా ఆధార్ కార్డులను పంపుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో ప్రైవేటు బ్యాంకులకు చెందిన లేఖలను సైతం వాట్సాప్‌లలో పంపిస్తూ అమాయకులను ఆశలో ముంచేస్తున్నారు.

దీనికి తోడు మీకు ఇంత భారీ నగదు వచ్చిన విషయం ఇతరులకు చెప్పితే వారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తారని అసూయతో మీకు ఆ ఖరీదైన బహుమతి రాకుండా చేస్తారని నమ్మిస్తారు. ఇలా రోజుకు ముగ్గురు నుంచి నలుగురు సైబర్ మోసగాళ్లు టార్గెట్ వ్యక్తి వెంట పడుతారు. వారి బాధిత వ్యక్తికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సమయం దాటిపోతుంది, అవకాశం కోల్పోతున్నారు, తిరిగి ఈ బహుమతి దక్కాలంటే చాలా కష్టమంటూ కం గారు పెడతారు. వారు హిందిలో అనర్గళంగా మాట్లాడి నిజంగానే బహుమతి చేజారిపోతుందనే భావనను తీసుకువచ్చి నగదు డిపాజిట్ చేయించుకుంటారు.

ఒక సారి నగదు డిపాజిట్ అయినా తర్వాత సైబర్ ఛీటర్‌ల ఫోన్ నెంబర్లు పని చేయవు. అమాయకులను బురిడి కొట్టించేందుకు మీకు టాటా సఫారీ కావాలా లేద నగదు కావాలా ఎంచుకోమని వల వేస్తారు. తాజా మోసాల్లో సైబర్ క్రిమినల్స్ బాధితుడి పేరు మీదనే ఆర్‌బీఐ గవర్నర్ సంతకం చేసిన లేఖలను తయారు చేసి పంపుతూ నిండా ముంచుతున్నారు. ఈ మో సాలకు పాల్పడే సైబర్ క్రిమినల్స్ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్‌లలో ప్రకటనలు ఇచ్చే సంస్థల నుంచి డాటాను కోనుగులు చేసి అ మాయకులను ఎర వేస్తున్నారని విచారణలో బయటపడుతుంది.

టాటా సఫారీ వద్దని రూ.12 లక్షల ఆశకు పోయి...


పీర్జాదీగూడ ప్రాంతానికి చెందిన ఓ ఆటో మెకానిక్ సోమేష్‌కు ఇటీవల ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీరు కొద్ది రోజుల కిందట నాప్‌టోల్‌లో ఓ వాచీని కోనుగోలు చేశారు కదా అని డిగాడు. అవును నిజమే నేను కొన్నానని జవాబు ఇచ్చా డు. అయితే ఆ కోనుగోలు చేసిన దానిపై లాటరీ తీస్తే మీరు టాటా సఫారీ కారును గెల్చుకున్నారని చెప్పాడు. దీంతో సోమేష్ సంతోషంలో మునిగిపోయాడు. మీకు కారు వద్దంటే దాని ఖరీదు 12. 80 లక్షల రూపాయలను చెల్లిస్తామన్నాడు. దీనికో ఓకే అన్న బాధితుడు నగదు కావాలని అడిగాడు. అయితే ముందుగా ప్రాసెసింగ్ ఫీజు కోసం 12 వేల కట్టాలని చెప్పి అతనికి ఓ బ్యాంక్ ఖాతా నెంబరును ఇచ్చాడు.

అది జమ చేయగానే మీ వాట్సాప్ లేదా మెయిల్‌కు కొన్ని పత్రాలను పంపిస్తానని చెప్పాడు. లేదంటే మీకు తెలిసిన వారి మెయిల్ ఐడీ ఇవ్వమని చెప్పాడు. ఆ మెయిల్‌కు ప్రైవేటు బ్యాంక్ సోమేష్ పేరు మీద జారీ చేసిన లేఖను పంపారు. అందులో మీ పేరు మీద 25.80 లక్షల చెక్ రెడీ అయ్యిందని చెప్పాడు. ఆ తర్వాత మరో సారి ఆర్‌బీఐ పేరు మీద ఆర్‌బీఐ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో ఉన్న లేఖను పంపారు. మీ పేరు మీద థాయ్‌ల్యాండ్ బాత్ కరెన్సిలో జారీ అయిన 12.80లక్షలను ఇండియన్ కరెన్సిలోకి మార్చి తే 25.80 లక్షలు అవుతుంది.ఈ మార్పిడికి మీరు 9 శాతం చార్జెస్ చెల్లిస్తే మీ బహుమతి చెక్ రిలీజ్ అవుతుందని అందులో వివరించడంతో సోమేష్ 9 శాతం కింద 2.30 లక్షలను చెల్లించాడు.

మరో సారి మీ చెక్ అన్ని ప్రక్రియలను పూర్తి చేసుకుని క్లియర్ అయ్యింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జీఎస్టీ కట్టాలని కోరుతూ జీఎస్టీ శాఖ నుంచి లేఖను పంపిస్తున్నట్లు పంపారు. అందులో 25.60 లక్షల నగదుకు జీఎస్టీ కింద మీరు 4.60 లక్షల రుపాయాలను చెల్లించాలని అడిగాడు. దీనికి స్పందించిన సోమేష్ మొదటి విడతగా ఓ లక్షన్నర చెల్లించాడు. మిగతాది చెల్లించే లోపే స్నేహితుల ద్వారా ఇది మోసమని తెలుసుకుని హెచ్చరించడంతో రాచకొండ సైబర్ క్రైం అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఇలా సోమేష్ మొత్తం 4.60లక్షలను పోగట్టుకున్నాడు. ఆశతో పోగట్టుకున్న ఆ డబ్బును సంపాదించాలంటే కనీసం ఆరు సంవత్సరాలు పడుతుందని సోమేష్ సైబర్ క్రైం పోలీసుల ఆవేదన వ్యక్తం చేశాడు.

మా దృష్టికి తీసుకురండి


సైబర్ క్రిమినల్స్ ఆన్‌లైన్ షాపింగ్ చేసిన వినియోగదారుల ఫోన్ నెం బర్లు, మెయిల్ ఐడీలను అక్రమంగా సేకరించి వారికి ఖరీదైన బహుమతులంటూ ఎర వేస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇలాంటి ఆఫర్‌లపై ఆశ కలిగితే అది న్యాయబద్ధమా లేదా మోసమా అని తెలుసుకునేందుకు స్నేహితులు లేదా సైబర్ క్రైం పోలీసుల దృష్టికి తీసుకురండి. డబ్బులు చెల్లించిన తర్వా త వస్తే మాత్రం వాటిని రాబట్టాలంటే చాలా కష్టం. ఇలాంటి మో సాలు తాజాగా ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా సైబర్ క్రిమినల్స్ సంఖ్య పెరుగుతుందన్నారు.
-ఎస్.హరినాథ్, రాచకొండ సైబర్ క్రైం

1569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles