రూ.25 లక్షల లాటరీ పేరుతో రూ.3.15 లక్షలు ఫట్

Sat,May 18, 2019 07:08 AM

cyber criminals looted 3.15 lacks on lottery fraud


హైదరాబాద్ : మీ సిమ్‌కార్డుకు రూ. 25 లక్షల కేబీసీ కంపెనీ లక్కీ లాటరీ వచ్చిందంటూ నమ్మించిన సైబర్‌నేరగాళ్లు .. ఓ వ్యక్తి నుంచి రూ. 3.15 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన సంతోష్‌కుమార్‌కు సుందర్‌ సింగ్‌ అనే పేరుతో ఓ వ్యక్తి వాట్సాప్‌ కాల్‌ చేశాడు. మీ సిమ్‌కార్డు రూ. 25 లక్షల కేబీసీ కంపెనీకి చెందిన లాటరీ గెలుపొందిందంటూ నమ్మించాడు. అదేరోజు సాయంత్రం ఆ డబ్బు తీసుకోవాలంటే రూ. 16,500 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలంటూ సూచించగా.. వెంటనే ఆ డబ్బును పేటీఎం ద్వారా చెల్లించాడు. ఆ తరువాత ఆదాయపన్ను శాఖకు రూ. 50 వేలు చెల్లించాలంటూ బాధితుడిని ఉచ్చులోకి దింపారు. ఈ ఫీజులన్నీ మీకు లాటరీ డబ్బులతో పాటు కలిపి తిరిగి వచ్చేస్తాయంటూ ఆశ పెట్టారు.

తనకు ఆధారాలు చూపించాలంటూ బాధితుడు కోరగా..ఇంకో నంబర్‌ ఇవ్వు అందులోకి రూ. 4.97 లక్షలు బదిలీ చేస్తామంటూ నమ్మించారు. ఈ డబ్బులు వెంటనే బదిలీ కావాలంటే లక్ష రూపాయలు చెల్లించాలంటూ సూచించారు. అందుకు సంబంధించిన చెక్కును చూపించి, ఆ డబ్బును బదిలీ చేస్తున్నట్లు నమ్మించారు. లక్ష రూపాయలు చెల్లిస్తేనే ప్రాసెస్‌ పూర్తవుతుందంటూ తెలుపడంతో రూ. 70 వేలు రెండు దఫాలుగా చెల్లించాడు. ఇంకా డబ్బులు అడుగుతుం డడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

1916
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles