బట్టలు ఆరేస్తుండగా విద్యుత్‌ షాక్‌..

Sat,May 18, 2019 08:49 AM

current shock hits mother, daughter while clothes drying


హైదరాబాద్ : బట్టలు ఆరేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై తల్లీకూతురు మృతి చెందారు. వీరిని కాపాడబోయిన మరో ఇద్దరు కూతుళ్లు స్వల్పగాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్సై నాగరాజు వివరాల ప్రకారం...బాలాపూర్‌ మండలం, షాహీన్‌నగర్‌ సైఫ్‌ కాలనీలో నివాసముంటున్న మహ్మద్‌ చాంద్‌, షేక్‌ సల్మా బేగం దంపతులకు ఐదుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగ పిల్లలు. మహ్మద్‌ చాం ద్‌ ఓ ఫంక్షన్‌హాల్‌లో పని చేస్తుండగా.. తల్లి ఇంట్లోనే ఉంటుంది.

బట్టలు ఆరేయడానికి ఇంటిపైన ఇనుప చువ్వకు జియో వైరు కట్టారు. కాగా... శుక్రవారం ఉదయం 9. 30 గంటల సమయంలో షేక్‌ సల్లా బేగం(35), కూతురు సానియా బేగం(09) లు బట్టలు ఉతికారు. వీటిని తల్లి జియో వైర్‌పై ఆరేస్తుండగా విద్యుత్‌షాక్‌కు గురైంది. తల్లిని కాపాడబోయిన కూతురు సానియా బేగం కూడా విద్యుత్‌షాక్‌కు గురైంది. వీరిద్దరిని కాపాడడానికి వెళ్లిన మరో ఇద్దరు కూతుళ్లు సమ్రీన్‌(13), ముస్కాన్‌(11) లు కూడా విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. ఇంటి సమీపంలోనివారు కట్టెతో జియో వైర్‌ను కొట్టగా తెగిపోయింది. అప్పటికే షేక్‌ సల్మాబేగం, సానియా బేగంలు మృతి చెందారు.

మరో ఇద్దరు కూతుళ్లకు స్వల్ప గాయాలు కాగా ఓవైసీ దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. భర్త చాంద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లీ కూతురు మృతి చెందడంతో కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి. బాధితుల కుటుంబాన్ని, ఓవైసీలో చికిత్స పొందుతున్న ఇద్దరు చిన్నారులను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు యూసుఫ్‌ పటేల్‌తో కలిసి పరామర్శించారు.

2546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles