రోడ్డు పక్కన పడేసిన 4 లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

Thu,December 6, 2018 07:12 PM

Currency seized by miryalaguda one town police which was thrown on road side

మిర్యాలగూడ: నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో గుర్తు తెలియని వ్యక్తులు ఓటర్లకు పంచడానికి తీసుకెళ్తున్న డబ్బులను రోడ్డు మీద పడేశాడు. అవి దాదాపు 4 లక్షల దాకా ఉన్నాయి. వాటిని గుర్తించిన వన్‌టౌన్ పోలీసులు.. ఆ డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ సదానాగరాజు తెలిపారు.

మరోవైపు మిర్యాలగూడలోని ఈదుల్ గూడ చౌరస్తా వద్ద కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఓ వ్యక్తి నుంచి 47 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి ఆ వ్యక్తి వద్ద ఎటువంటి ఆధారం లేకపోవడంతో అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

5110
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles