బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్ష

Sat,August 17, 2019 05:39 PM

CS review with top executives on telangana budget proposals

హైదరాబాద్‌: అన్ని శాఖల అధికారులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషీ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీక్షించారు. శాఖల వారిగా బడ్జెట్‌ ప్రతిపాదనలు సమీక్షించారు. ఈ ఏడాది సంబంధించిన వివిధ శాఖలు బడ్జెట్‌ ప్రతిపాదనలను వెంటనే ఆర్థిక శాఖకు సమర్పించాలని ఆదేశించారు. బడ్జెట్‌ సమావేశాలు సెప్టెంబర్‌లో జరిగే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ త్వరలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. కేంద్ర ప్రయోజిత పథకాలు, కేంద్ర బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకోవాలి. బడ్జెట్‌ ప్రతిపాదనలో పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సమీక్షలో వివరించారు.

674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles