ఉగ్రదాడిని ఖండిస్తూ.. సీఆర్‌పీఎఫ్‌, బీజేపీ ర్యాలీ

Fri,February 15, 2019 06:47 PM

CRPF, BJP Protest rally against terror attack in Hyderabad

హైదరాబాద్‌: పుల్వామా ఉగ్రదాడిని నిరసిస్తూ నగరంలో సీఆర్‌పీఎఫ్‌, బీజేపీ ర్యాలీ నిర్వహించింది. జలవిహార్‌ నుంచి పీపుల్స్‌ ప్లాజా వరకు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ర్యాలీ చేపట్టారు. అదేవిధంగా నాంపల్లి నుంచి గోషామహల్‌ మైదానం వరకు బీజేపీ రాష్ట్రశాఖ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యే రాజాసింగ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉగ్రదాడిలో అమరులైన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు ఆశ్రు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతికై కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.

723
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles